Mothers Day | తల్లితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
మదర్స్ డే (Mothers Day) సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లు తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ అమ్మతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
న్యూఢిల్లీ : మదర్స్ డే (Mothers Day) సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లు తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ అమ్మతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇక కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర సైతం ఈ ట్రెండ్‌లో జాయిన్ అయ్యారు. తన తల్లి ఇందిరాతో తాను కలిసిఉన్న పాత ఫొటోను షేర్ చేశారు. తల్లితో ఆనంద్ మహీంద్ర చిన్ననాటి ఫొటోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు.
ఈ ఫొటోలో కంపెనీ వాటాదారుల సమావేశంలో చిన్నారి ఆనంద్ మహీంద్ర పక్కన ఇందిరా మహీంద్రా కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ప్రతి ఏటా మదర్స్ డే రోజున తాను తన తల్లి పాత ఫొటోలను వెలికితీస్తుంటానని, ఈసారి గతం నుంచి ఈ అద్భుత ఫొటో ముందుకొచ్చిందని, ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ పారిశ్రామిక దిగ్గజం రాసుకొచ్చారు.
ఈ ఫొటో తన తండ్రి అధ్యక్షతన జరిగిన మహీంద్ర ఉజైన్ స్టీల్ వార్షిక వాటాదారుల సమావేశానికి తన తల్లి తనను తొలిసారిగా తీసుకువచ్చిన సందర్భంలోనిదని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు 2.6 లక్షల వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. పాత ఫొటోపై ప్రేమ కురిపించిన నెటిజన్లు ఈ ప్రత్యేక సందర్భంలో ఆనంద్ మహీంద్రను అభినందించారు. తమ తల్లులను ఎలా మిస్ అవుతున్నామనేది కూడా పలువురు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More
Viral Video | పిల్లిని కాపాడిన కుందేలు..ఏం చేసిందంటే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

