న్యూఢిల్లీ : కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఇన్స్పిరేషనల్ పోస్టులను షేర్ చేస్తుంటారు. లేటెస్ట్గా ఓ మహిళ టీ షర్ట్‌ను సులభంగా మడిచే టెక్నిక్‌తో కూడిన వీడియోను (viral video) పోస్ట్ చేయగా అది నెట్టింట వైరల్‌గా మారింది.
I can’t resist being fascinated by this kind of seemingly trivial stuff. May not change the world, but it’s so creative & right-brained. Everything that saves time on mundane chores is progress! 😊 pic.twitter.com/tEPqXtjNsZ
— anand mahindra (@anandmahindra) April 5, 2023
ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేయగా ఈ క్లిప్‌ను ఆన్లైన్లో ఏకంగా 1.8 కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియోలో ఓ మహిళ టీ షర్ట్‌ను మడత పెట్టడం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమె టీ షర్ట్‌పై 1, 2, 3 అని రాసిఉన్న చిన్న కార్డులను ఉంచి ఆ క్రమంలో టీ షర్ట్‌ను ఫోల్డ్ చేయడం చూడొచ్చు. ఇది చిన్న విషయమే కావచ్చు..ప్రపంచాన్ని మార్చివేసేది కాకున్నా ఇది సృజనాత్మకతతో కూడిన పని.
విలువైన సమయాన్ని ఆదా చేస్తుందని పారిశ్రామిక దిగ్గజం ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. మహీంద్రాతో ఏకీభవించిన ట్విట్టర్ యూజర్లు మహిళ టెక్నిక్‌పై ప్రశంసలు గుప్పించారు. బ్రిలియంట్..అద్భుతమైన క్రియేటివిటీ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, వీడియోలో ఇది సులభంగా కనిపించినా, ప్రాక్టికల్‌గా అంత సులభమేమీ కాదని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More