న్యూఢిల్లీ : కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ స్ఫూర్తి నింపే, ఆలోచన రేకెత్తించే పోస్టులతో పాటు ఆకట్టుకునే వీడియోలను షేర్ చేస్తుంటారు. లేటెస్ట్గా అద్భుతంగా అనిపించే వినూత్న విండో స్టైల్ వీడియోను ఆయన నెట్టింట షేర్ చేశారు.
గ్లాస్‌తో తయారు చేసిన ఈ కిటికీ హ్యాంగింగ్ బాల్కనీగా మారే వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేయగా ఈ క్లిప్ పలువురు నెటిజన్లను ఆకట్టుకుంది. కిటికీని కొద్ది సెకండ్ల వ్యవధిలోనే బాల్కనీగా మార్చే వినూత్న నిర్మాణ డిజైన్‌ను ఆయన నెటిజన్ల ముందుంచారు. అవుట్డోర్స్తో జీవనశైలిని మేళవించే వినూత్న విండో డిజైన్ ఇదని, భవనాలు నిర్మించే సమయంలో ఈ ఐడియాను కూడా మనం పరిశీలించాలని ఆనంద్ మహీంద్ర రాసుకొచ్చారు.
Frankly, the building industry rarely is a setting for innovation, so this is pretty impressive. And very much in line with new lifestyles that integrate with the outdoors. One more idea for you to consider when planning our buildings, @amitsinha73 pic.twitter.com/1xUBYid2R2
— anand mahindra (@anandmahindra) July 16, 2023
ఛాయ్, పకోడీలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇది పర్ఫెక్ట్గా ఉంటుందని ఓ యూజర్ కామెంట్ చేయగా, భవన నిర్మాణాల్లో ఈ ఐడియాను ఇప్పటికే వాడుతున్నారని మరో యూజర్ రాసుకొచ్చారు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఓ అపార్ట్మెంట్ భవనంలో తొలి మోడల్‌ను ఇన్స్టాల్ చేశారని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :