తిరువనంతపురం: కేరళలో అనూహ్య ఘటన చోటుచేసుకున్నది. ప్రయాణికులతో కూడిన ఓ ప్రైవేట్ బస్సును ఏనుగు వెంబడించగా, డ్రైవర్ చాకచక్యంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. త్రిస్సూర్ జిల్లాలోని అటవీమార్గంలో 40 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సుకు ఏనుగు అడ్డుగా వచ్చింది. గజరాజు మీదిమీదికి వస్తుండడంతో డ్రైవర్ రివర్స్ గేర్ వేశాడు. ఏనుగు వెంబడిస్తూనే ఉండడంతో ఒకటి కాదు.. రెండు కాదు.. 8 కిలోమీటర్లు రివర్స్ గేర్‌లోనే బస్సును నడిపాడు. ఏనుగుబారినుంచి ప్రయాణికులను కాపాడాడు.