పాలి(రాజస్థాన్): భారీ వర్షాల నేపథ్యంలో రాజస్థాన్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకొన్నది. పాలి జిల్లాలోని తఖత్గర్ పోలీసుస్టేషన్లోకి భారీయెత్తున వరద నీరు చేరింది.
దీంతో పోలీసులు ఓ కేసులో అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను కోర్టుకు తీసుకెళ్లేందుకు బోట్లు, ట్రాక్టర్లను వినియోగించాల్సిన పరిస్థితి తలెత్తింది. వాటిలోనే తిరుగుతూ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 20 రోజుల వ్యవధిలో పోలీసుస్టేషన్ రెండుసార్లు వరద పరిస్థితులను ఎదుర్కొన్నది.