ముంబై: ముంబై వాయువ్య స్థానం నుంచి శివసేన (యూబీటీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమోల్ కీర్తికర్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కొవిడ్ సమయంలో వలస కార్మికులకు కిచిడీ పంపిణీ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై ఏప్రిల్ 8న తమ ముందు విచారణకు హాజరు కావాలని శుక్రవారం సమన్లు ఇచ్చింది.
వాస్తవానికి ఆయన ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే ఈ కేసులో తమ ముందు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. కాగా, అమోల్ తండ్రి గజానన్ కృ తికర్ ఠాక్రే వ్యతిరేక వర్గమైన ఏక్నాథ్ షిండే వర్గంలో ఉండటమే కాక, ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు.