లక్నో, ఆగస్టు 2: చికిత్స జరపకుండా రోగిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో బీజేపీ పాలిత యూపీలోని లక్నో ప్రభుత్వ దవాఖానలో వృద్ధుడొకరు మరణించాడు. ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన పడక కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎన్నో గంటలు ఎదురు చూసినా అధికారులు కేటాయించలేదు.
ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడంతో లక్నోలోని సరోజినీ నగర్ నివాసి కాశీ ప్రసాద్ గోస్వామి(70)ని గురువారం ఒక ప్రైవేట్ దవాఖానకు తరలించి, తర్వాత పరిస్థితి విషమంగా మారడంతో ప్రభుత్వ కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ దవాఖానకు తరలించారు.
అయితే అక్కడ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఆయనకు బెడ్ ఇవ్వడానికి, ఆక్సిజన్ పెట్టడానికి దవాఖాన సిబ్బంది నిరాకరించారు. స్ట్రెచర్‌పైనే నాలుగు గంటల పాటు పడి ఉన్న అతడిని ఒక్క డాక్టర్ కూడా పరీక్షించ లేదు. దీంతో విసుగెత్తిపోయిన ఆయన బంధువులు ఆయనను మొదట చికిత్స చేసిన ప్రైవేట్ ఆసుపత్రికే తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.