తిరువనంతపురం : కొజికోడ్ ఎయిర్పోర్టులో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కార్గో కంపార్ట్మెంట్ నుంచి ఫైర్ వార్నింగ్ రావడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. ఈ విమానం కాలికట్ నుంచి కువైట్ బయల్దేరిన కాసేపటికే ఫైర్ వార్నింగ్ వచ్చింది. ఈ సమయంలో విమానంలో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో అత్యవసరంగా విమానాన్ని దించేశారు. విమానం ల్యాండ్ అవగానే అక్కడికి అగ్నిమాపక దళాలు వెళ్లాయి. పరిస్థితిని అగ్నిమాపక దళాలు పర్యవేక్షిస్తున్నాయి.
An Air India Express flight made an emergency landing at Kozhikode, Kerala following fire warning in Cargo compartment. pic.twitter.com/1kqcR3YNio
— ANI (@ANI) April 9, 2021