Milk Procurement: అముల్ వర్సెస్ అవిన్.. అమిత్ షా జోక్యాన్ని కోరిన సీఎం స్టాలిన్
CM Stalin: అవిన్కు పాలు సరఫరా చేసే కేంద్రాల నుంచి అముల్ సంస్థ పాలను సేకరించడం నిలిపివేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమిళనాడులో అముల్ సంస్థను ఆపరేట్ చేయడం దురదృష్టకరమన్నారు.
చెన్నై: గుజరాత్‌కు చెందిన అముల్(Amul) సంస్థ.. తమిళనాడుకు చెందిన అవిన్(Aavin) డైయిరీ సంస్థ నుంచి పాలను సేకరిస్తున్నది. అయితే రాష్ట్రానికి చెందిన అవిన్ నుంచి పాలను ప్రొక్యూర్(Milk Procure) చేయడం ఆపేయాలని అముల్ సంస్థను సీఎం స్టాలిన్ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ట్విట్టర్లో ఇవాళ స్టాలిన్ దానికి సంబంధించిన ఓ పోస్టు చేశారు.
కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తుల సంఘం(అముల్) తమ వద్ద ఉన్న మల్టీ స్టేట్ లైసెన్స్‌తో కృష్ణగిరి జిల్లాలో ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని, అయితే దాని వల్ల కృష్ణగిరి, ధర్మపురి, వెల్లోర్, రాణిపేట, తిరుపత్తూర్, కంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో రైతుల నుంచి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుంచి పాలను ప్రొక్యూర్ చేస్తున్నారని, ఆ ప్రక్రియను ఆపేయాలని సీఎం స్టాలిన్ తన లేఖలో మంత్రి అమిత్ షాను కోరారు.
The decision of AMUL to operate in Tamil Nadu is unfortunate, detrimental to the interest of Aavin and will create unhealthy competition between the cooperatives.
Regional cooperatives have been the bedrock of dairy development in the states and are better placed to engage and… pic.twitter.com/yn2pKINofO
— M.K.Stalin (@mkstalin) May 25, 2023
ఒక సహకారం సంఘంపై మరో సహకార సంఘం ఆధారపడరాదు అని, ఇండియాలో ఉన్న ఆ విధానాన్ని పాటించాలని అముల్ సంస్థను స్టాలిన్ కోరారు. అక్రమ రీతిలో పాలను ప్రొక్యూర్ చేయడం వల్ల అది ఆపరేషన్ వైట్ ఫ్లడ్ స్పూర్తికి విగాతం కలిగించినట్లు అవుతుందని అన్నారు. అవిన్ డెయిరీ సంస్థకు పాలను సరఫరా చేసేవారిపై అముల్ ఆధారపడడం వల్ల అది సహకార స్పూర్తిని దెబ్బతీస్తుందని స్టాలిన్ తెలిపారు.
అముల్ అనుసరిస్తున్న విధానాల వల్ల పాలు సేకరిస్తున్న సహకార సంఘాల్లో పోటీతత్వం అనారోగ్యకరంగా మారుతుందని స్టాలిన్ తెలిపారు. తక్షణమే అముల్ సంస్థ పాల సేకరణ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ తన లేఖలో అమిత్ షాను కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

