అమూల్ పాల ధర పెంపు
పాల ధరలు మరింత భారం కానున్నాయి. పాల ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ అమూల్, మదర్ డెయిరీ నిర్ణయం తీసుకున్నాయి. గోల్డ్, తాజా, శక్తి బ్రాండ్ల పాల ధరను లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేరుతో డెయిరీ ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ప్రకటించింది. పాల ఉత్పత్తి ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకొన్నామని
- లీటర్‌కు రూ.2 పెరిగిన ధర.. అదే బాటలో మదర్ డెయిరీ
న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): పాల ధరలు మరింత భారం కానున్నాయి. పాల ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ అమూల్, మదర్ డెయిరీ నిర్ణయం తీసుకున్నాయి. గోల్డ్, తాజా, శక్తి బ్రాండ్ల పాల ధరను లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేరుతో డెయిరీ ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ప్రకటించింది. పాల ఉత్పత్తి ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకొన్నామని, ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. రూ.2 పెంపుతో ఎమ్మార్పీ 4% శాతం పెరుగుతుంది. పెరిగిన ధరలు అమూల్ మార్కెటింగ్ చేసే ప్రతి చోటా వర్తిస్తాయని వివరించింది. అహ్మదాబాద్, సౌరాష్ట్ర మార్కెట్లలో అర లీటర్ అమూల్ గోల్డ్ పాలను రూ.31కి, అమూల్ తాజా పాలను రూ.25కి, అమూల్ శక్తి పాలను రూ.28కి అమ్మనున్నట్టు తెలిపింది.
మదర్ డెయిరీ సైతం
మదర్ డెయిరీ కూడా పాల ధర పెంచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నామని, బుధవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. లీటర్ ఫుల్ క్రీమ్ పాలను రూ.61కి, టోన్డ్ పాలను రూ.51కి, డబుల్ టోన్డ్ పాలను రూ.45కి, ఆవు పాలను రూ.53కి, బల్క్ వెండెడ్ (టోకెన్) పాలను రూ.48కి అమ్మనున్నట్టు వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- amul
- hike
- Milk price
- Mother Diary
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

