BSF | సరిహద్దు భద్రతా దళం (BSF) ఆదివారం అమృత్సర్ జిల్లాలోని సరిహద్దు గ్రామం భైనిలో దెబ్బతిన్న డ్రోన్‌తో పాటు భారీగాహెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక విచారణ అనంతరం బీఎస్ఎఫ్ అధికారులు హెరాయిన్‌ను స్థానిక పోలీసులకు అప్పగించారు. పాక్ సరిహద్దు గ్రామమైన భైని సమీపంలో బీఎస్ఎఫ్ బృందం గస్తీ తిరుగుతోందని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. గ్రామ సమీపంలోని పొలంలో డ్రోన్‌తో పెద్ద ప్యాకెట్ ఉన్నట్లుగా బీఎస్ఎఫ్కి సమాచారం అందింది.
వెంటనే సైన్యం గ్రామ శివారులో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సాయంత్రం 5.45 గంటల సమయంలో సెర్చ్ ఆపరేషన్ పాల్గొన్న సైనికులకు చైనాలో తయారు చేసిన పూర్తిగా దెబ్బతిన్న క్వాడ్‌కాప్టర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రోన్‌కు నీలిరంగం ప్లాస్టిక్ కవర్ చుట్టిన ప్యాకెట్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా.. 2 కిలోలకుపైగా హెరాయిన్ లభ్యమైంది. బీఎస్ఎఫ్ అధికారులు డ్రోన్, హెరాయిన్ ప్యాకెట్లను స్థానిక పోలీసులకు అప్పగించారు.