కోలీవుడ్ స్టార్స్ ధనుష్, సూర్యలతో సార్, విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి బ్లాక్బస్టర్స్ని అందించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. మళ్లీ ధనుష్ హీరోగా ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ధనుష్ కెరీర్లో 56వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి విజయ్ బి.కుమార్ దర్శకత్వం వహించనున్నారు. కన్నప్ప, బ్లాస్ట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి ముకుందన్ కథానాయిక. సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటన విడుదల చేశారు.