న్యూఢిల్లీ, మార్చి 18: వంద వాహనాలు.. వందల మంది స్టేట్ స్పెషల్ టీమ్ పోలీసులు.. ఒక్కడిని వేటాడేందుకు బయల్దేరారు. అతడి చుట్టూ వందల మంది సాయుధులైన అనుచరులున్నా, అతడి కాన్వాయ్‌ను వెంటాడారు. కానీ అతడు మాత్రం ఇప్పటిదాకా పోలీసులకు చిక్కలేదు. సినీ ఫక్కీలో ఉత్కంఠ రేపుతున్న ఈ ఆపరేషన్ పంజాబ్‌లో కొనసాగుతున్నది. పోలీసులు వెతుకుతున్న ఆ నిందితుడు ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్. షాకోట్ తాలుకాలోని జలంధర్‌కు వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ రాక గురించి ముందే తెలుసుకున్న పోలీసులు.. ఆ ఊరి చుట్టూ పారామిలటరీ బలగాలను మోహరిం చినా అతడిని పట్టుకోలేక పోయారు. కానీ అమృత్‌పాల్ మద్దతుదారులైన 78 మందిని అరెస్టు చేశారు.