ముంబై: సబ్స్క్రిప్షన్ సేవలకు సంబంధించిన రుసుములు చెల్లించలేదన్న కారణంతో ట్విటర్ ఇవాళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖుల పేర్ల ముందు బ్లూ టిక్ మార్కును తొలగించింది. బ్లూ టిక్ మార్క్ కోల్పోయిన వారిలో రాహుల్‌గాంధీ, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), పవన్ కళ్యాణ్, విరాట్ కోహ్లీ తదితరులు ఉన్నారు. తాను సబ్‌స్క్రప్షన్ సేవలకు రుసుము చెల్లించినా తన పేరు ముందున్న బ్లూ టిక్ మార్కును తొలగించడంపై బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు.
“హేయ్ ట్విటర్.. నువ్వు వింటున్నావా..? సబ్స్క్రిప్షన్ సేవల కోసం నేను రుసుము చెల్లించా. కాబట్టి నా పేరు ముందు బ్లూ టిక్ మార్కును దయచేసి తిరిగి ఇచ్చేయండి. బ్లూ టిక్ తిరిగిస్తేనే నేను అమితాబ్‌బచ్చన్ అని జనాలకు తెలుస్తుంది. నేను చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా” అని అమితాబ్ తన ట్విటర్ హ్యాండిల్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతున్నది.
T 4623 – ए twitter भइया ! सुन रहे हैं ? अब तो पैसा भी भर दिये हैं हम … तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं – Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का ??
— Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023