National
- Dec 05, 2020 , 11:03:51
రైతు ఆందోళనలపై ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులతో జరిగిన రెండు దఫాల చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో ఇవాళ కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. రైత ఆందోళనలకు మద్దతు పెరగడంతో.. ఢిల్లీ సరిహద్దుల్లోని దారులన్నీ మూసివేశారు. కనీస మద్దతు ధరపై కేంద్రం హామీ ఇచ్చినా.. తాము మాత్రమే చట్టాలను రద్దు చేసే వరకు విశ్రమించేదిలేదని రైతులు నినదిస్తున్నారు.
తాజావార్తలు
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి
- భరోసాతో బడికి
- ఈ రాశులవారికి.. ఆకస్మిక ధనలాభం
MOST READ
TRENDING