న్యూఢిల్లీ: జనన, మరణాలను సులువుగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్ఎస్) పేరుతో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ యాప్ను మంగళవారం న్యూఢిల్లీలోని జనగణన భవన్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు.
ఏ ప్రాంతం నుంచైనా, ఏ సమయంలోనైనా ఆయా రాష్ర్టాల అధికారిక భాషల్లో ఈ యాప్ ద్వారా జనన, మరణాలను నమోదు చేయవచ్చని అమిత్ షా పేర్కొన్నారు.