న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశంసలు గుప్పించారు. ఆత్మనిర్భర్ భారత్ దేశంలో 60 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిందని అన్నారు. దేశంలో వాణిజ్య, పరిశ్రమ, వ్యాపారాలతో పాటు దేశంలో 140 కోట్ల మంది ప్రజలను స్వయం సమృద్ధి దిశగా నడిపించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అమిత్ షా వివరించారు.
అంతరిక్షం, పరిశోధన, అభివృద్ధి సహా అన్ని రంగాలపై ప్రధాని మోదీ దృష్టి సారించినా సంక్షేమం, పేదలు, అణగారిన వర్గాల బాగోగులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. ప్రధాని మోదీ తన దూరదృష్టి, విధానాలతో దేశంలో 60 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారని తెలిపారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పీఎం స్వనిధి యోజన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19పై పోరులో స్వదేశీ వ్యాక్సిన్‌తో ముందుకొచ్చిన తొలి దేశంగా భారత్ అరుదైన ఘనతను సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు.
Read More :
KTR | తెలంగాణ ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధికి వినియోగించలేదు: కేటీఆర్