న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జడ్ క్యాటగిరీ సెక్యూరిటీని స్వీకరించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కేంద్ర హోంమంత్రి అమిత్షా కోరారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. ఒవైసీకి ప్రాణ హాని ఉందని, ఇంకా ముప్పు తొలగిపోలేదని ఇటీవల జరిపిన సమీక్షలో తేలిందని తెలిపారు. అయినా జడ్ క్యాటగిరీ సెక్యూరిటీని తీసుకునేందుకు ఒవైసీ అంగీకరించట్లేదని పేర్కొన్నారు. అయితే అమిత్షా విజ్ఞప్తిని ఒవైసీ మరోసారి తిరస్కరించారు. ఇటీవల ఒవైసీ కారుపై యూపీలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. జడ్ క్యాటగిరీ భద్రత కల్పిస్తామని కేంద్రం తెలుపగా.. ఒవైసీ అందుకు తిరస్కరించారు. దేశంలోని దళితులు, మైనారిటీలు, నిమ్న వర్గాలు సురక్షితంగా ఉంటే తాను కూడా సురక్షితంగా ఉంటానని పేర్కొన్నారు.