పెట్రో ధరల పెంపుతో క్యాబ్ చార్జీలు భారం : 14 శాతం పెంచిన ఓలా, ఊబర్
ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసరాలు సహా అన్ని సేవలు, వస్తువుల ధరలు భారమవుతున్నాయి. రవాణా వ్యయాలు పెరిగి కూరగాయలు, కిరాణా వస్తువులు, పండ్లు సహా అన్నీ చుక్కలు చూస్తున్నాయి.
చెన్నై : ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసరాలు సహా అన్ని సేవలు, వస్తువుల ధరలు భారమవుతున్నాయి. రవాణా వ్యయాలు పెరిగి కూరగాయలు, కిరాణా వస్తువులు, పండ్లు సహా అన్నీ చుక్కలు చూస్తున్నాయి. పెట్రో ధరల సెగలతో క్యాబ్‌ల ధరలూ భారమయ్యాయి.
ఇంధన ధరల భారంతో చెన్నైలో ఓలా, ఊబర్ వంటి క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్లు చార్జీల ధరలను 14 శాతం వరకూ పెంచారు. డ్రైవర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కస్టమర్లపై చార్జీల భారం మోపకతప్పడం లేదని ఊబర్ సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ (ఇండియా, దక్షిణాసియా) నితీష్ భూషణ్ పేర్కొన్నారు.
పెట్రో ధరల పెరుగుదలతో ఇంధన వ్యయం, డ్రైవర్ల సంపాదన దృష్టిలో పెట్టుకుని చార్జీల ధరను 10 నుంచి 14 శాతం పెంచామని చెప్పారు. ఇంధన ధరల సవరణను పరిశీలించి ఆపై తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఊబర్ ఇండియా అంతకుముందు ముంబైలో 15 శాతం, ఢిల్లీలో 12 శాతం, చెన్నైలో 10 శాతం వరకూ క్యాబ్ చార్జీలను పెంచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

