న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్న క్రమంలో సోమవారం దేశంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. ఒక పక్క వేడి గాలులు, ఉక్కపోత, తీవ్ర వేడి కారణంగా ఏసీలు, కూలర్లు, ఫ్లాన్లు వంటి విద్యుత్ ఉపకరణాల వాడకం అత్యధికం కావడంతో ఒక్క రోజే 257.37 గిగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైందని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.
ఇది ఈ ఏడాది ఏప్రిల్ 25న నమోదైన 256.11 గిగావాట్ల కన్నా అధికమని తెలిపింది. ఈ వేసవిలో అత్యధిక విద్యుత్ వినియోగం 270 గిగావాట్లకు చేరుకోవచ్చునని పేర్కొన్నది.