BJP MLAs Marshalled Out | సీఎం కేజ్రీవాల్ అధికార నివాసంపై బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం.. అసెంబ్లీ నుంచి బయటకు పంపిన మార్షల్స్
BJP MLAs Marshalled Out | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ఆధునీకరణపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాగ్వాదానికి దిగారు. వారి నిరసనతో సభ అదుపు తప్పింది. దీంతో మార్షల్స్ సహాయంతో వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ఆధునీకరణపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాగ్వాదానికి దిగారు. వారి నిరసనతో సభ అదుపు తప్పింది. దీంతో మార్షల్స్ సహాయంతో వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపారు. (BJP MLAs Marshalled Out) 2020-22 మధ్య కాలంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం పునరుద్ధరణకు ఆప్ ప్రభుత్వం రూ.189 కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ ఆరోపించింది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దీనిపై చర్చ జరుగాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరి నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ వారి డిమాండ్‌ను తిరస్కరించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన తెలిపారు.
కాగా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఢిల్లీ జల్ బోర్డ్, హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు స్పీకర్ అనుమతించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు తమ నిరసన వీడలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరితో సహా బీజేపీ ఎమ్మెల్యేలు అభయ్ వర్మ, అజయ్ మహావార్, మోహన్ సింగ్ బిష్త్, అనిల్ కుమార్ బాజ్‌పాయ్, విజేందర్ గుప్తా, ఓం ప్రకాష్ శర్మ, జితేందర్ మహాజన్‌ను అసెంబ్లీ నుంచి బయటకు పంపాలని స్పీకర్ గోయల్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మార్షల్స్ వారిని బయటకు తరలించారు. అనంతరం అసెంబ్లీ బయట నిరసనను బీజేపీ ఎమ్మెల్యేలు కొనసాగించారు.
VIDEO | BJP MLAs, marshalled out of the Delhi Assembly, hold protest at Mahatma Gandhi statue in the Assembly premises.
"Arvind Kejriwal spent Rs 189 crore on his 'rajmahal' while violating all laws and regulations. The (AAP) government is not ready to answer on the… pic.twitter.com/e5D54UratR
— Press Trust of India (@PTI_News) December 18, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

