Night Curfew | పెరుగుతున్న కరోనా కేసులు.. 17 నగరాల్లో నైట్‌కర్ఫ్యూ
Night Curfew | గుజరాత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం

అహ్మదాబాద్ : గుజరాత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం అమలు చేస్తున్న నైట్‌కర్ఫ్యూను మరో 17 పట్టణాలకు విస్తరించింది. ఇదిలా ఉండగా.. ఎనిమిది మెట్రోలు, రెండు నగరాల్లో ఆంక్షలను ఈ నెల 26 వరకు పొడిగించినట్లు సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. సురేంద్రనగర్, ధ్రాంద్ర, మోర్బి, వంకనేర్, ధోరాజి, గొండాల్, జెట్పూర్, కలవాడ్, గోద్రా, విజల్‌పూర్, నవ్సారి, నవ్సారి, బిలిమోరా, వ్యారా, వాపి వల్సాద్, భరూచ్, అంక్లేశ్వర్‌లో నైట్‌కర్ఫ్యూను విధించనున్నారు. శుక్రవారం సీఎం పటేల్ కొవిడ్‌పై సమీక్ష నిర్వహించి, మార్గదర్శకాలను ప్రకటించారు.
ఇంతకు ముందు ఈ నెల 7న ప్రభుత్వం అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, గాంధీనగర్, జునాగఢ్, జామ్‌నగర్, భావ్‌నగర్, ఆనంద్, నదియాడ్ నగరాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య రాత్రి కర్ఫ్యూను ప్రకటించింది. సామాజిక, మతపరమైన కార్యక్రమాల్లో 150 మందికి మించకుండా అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్లు, లైబ్రరీలు, ఆడిటోరియంలు, జిమ్‌లు 50శాతం ఆక్యుపెన్సీతో పని పని చేస్తాయని చెప్పింది. బస్సులను 75శాతం కెపాసిటీ నడిపేందుకు అనుమతి ఇచ్చింది. గుజరాత్లో శుక్రవారం 21,255 కొవిడ్ కేసులు నమోదవగా.. 16 మంది దుర్మరణం పాలయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

