ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం నేతలు శరద్ పవార్ శిబిరంలో చేరుతున్నారు. ఈ పరిణామాలపై అజిత్ పవార్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పూణెలోని పింప్రి చించ్వాడ్ ఎన్సీపీ నేతలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు చేజారకుండా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా, పింప్రి చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవానే, సీనియర్ ఎన్సీపీ నేతలు రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్, యశ్ సానే మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. అలాగే 25 మంది కార్పొరేటర్లు ఎన్సీపీని వీడారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్)లో వారంతా చేరారు.
మరోవైపు మహారాష్ట్ర మంత్రి, సీనియర్ ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ కూడా అజిత్ పవార్‌ను వీడనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల శరద్ పవార్‌ను ఆయన ఇంట్లో కలిశారు. మహా వికాస్ అఘాడిలో భాగమైన శివసేన (యూబీటీ) నేతతో కూడా గత నెలలో ఆయన సమావేశమయ్యారు. అలాగే మరికొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా శరద్ పవర్ శిబిరానికి తిరిగి వచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
Maharashtra | NCP leader and Deputy CM Ajit Pawar is meeting party leaders from Pimpri Chinchwad, at Pune Circuit House
Yesterday, 29 NCP corporators joined NCP-SCP in the presence of Sharad Pawar in Pune. pic.twitter.com/HOmuKBFiVu
— ANI (@ANI) July 18, 2024