ముంబై: దారికి అడ్డుగా ఉన్న వ్యక్తితో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ (excuse me) అని ఒక మహిళ ఇంగ్లీష్‌లో అన్నది. అయితే మరాఠీలో మాట్లాడనందుకు ఆ వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులు కలిసి ఇద్దరు మహిళలపై దాడి చేశారు. కర్రలతో వారిని కొట్టారు. (Marathi tension) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని డోంబివాలిలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి పూనమ్ గుప్తా, గీతా చౌహాన్ కలిసి స్కూటీపై హౌసింగ్ సొసైటీ వద్దకు చేరుకున్నారు. స్కూటీ నడిపిన గీత, ఎంట్రన్స్ వద్ద అడ్డుగా ఉన్న వ్యక్తితో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అని ఇంగ్లీష్‌లో అన్నది.
కాగా, ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే ఆ వ్యక్తి, మరాఠీలో మాట్లాడాలని ఆ మహిళను డిమాండ్ చేశాడు. దీనికి గీతా నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమె చేయి పట్టుకుని మెలితిప్పాడు. ఇంతలో అతడి కుటుంబ సభ్యులైన మహిళలు, పురుషులు అక్కడకు వచ్చారు. గీతతోపాటు 9 నెలల చిన్నారితో ఉన్న పూనమ్‌తో ఘర్షణకు దిగడంతోపాటు కొట్టారు. వారిని రక్షించేందుకు అక్కడకు వచ్చిన పూనమ్ భర్త అంకిత్ తలపై రాడ్‌తో కొట్టారు.
మరోవైపు బాధిత మహిళలు ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా అన్నది కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, మరాఠీ భాషను అన్నిచోట్ల తప్పక అమలు చేయాలని రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో జరిగిన మరాఠీ వివాదానికి సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
महिलांना लाकडी दांडक्यांनी मारहाण, ७ जणांविरोधात तक्रार दाखल https://t.co/2jrmCKw8Ui #Maharashtra #Dombivali #Fight #Marathi pic.twitter.com/g3w0hTg2PH
— LoksattaLive (@LoksattaLive) April 8, 2025