Coronavirus | భారత్లో కరోనా వైరస్ (Coronavirus) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో కొత్తగా 756 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగింది. గత ఏడు నెలల్లో కేసుల సంఖ్య ఇంత చేరడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి కొత్త వేరియంట్ (New Covid Variant) జేఎన్.1 (JN.1) కారణమని తెలుస్తోంది.
ఇక గత 24 గంటల వ్యవధిలో మహమ్మారి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇద్దరు కాగా, రాజస్థాన్, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,332కి ఎగబాకింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4.50 కోట్లకు (4,50,07,964) చేరింది. మహమ్మారి నుంచి 4,44,71,212 మంది కోలుకున్నారు.
ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
Also Read..
Tamil Nadu | పొంగిపొర్లుతున్న శ్రీవైకుంఠం మెట్టు డ్యాం .. వీడియోలు
President | తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
INDW vs AUSW | కంగారూలను ఉతికారేసిన అమ్మాయిలు.. ఆస్ట్రేలియాపై రికార్డు స్కోర్ కొట్టిన టీమిండియా