కొల్లామ్: అమెరికాకు చెందిన ఓ మహిళ(American woman)పై.. కేరళలో ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆశ్రమంలో ఉంటున్న ఆమెపై ఆ ఇద్దరు లైంగికంగా దాడి చేసినట్లు తేలింది. ఈ కేసులో ఆ వ్యక్తుల్ని అరెస్టు చేశారు. కరుణగప్పల్లి పోలీసులు ఆ ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూలై 31వ తేదీన అమెరికా మహిళపై దాడి జరిగింది. ఆశ్రమం వద్ద ఉన్న బీచ్లో ఒంటరిగా కుర్చున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెతో స్నేహం చేశారు. ఆ తర్వాత ఓ ఖాళీ ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై లైంగికంగా దాడి చేశారు. ఆ ఇద్దరూ కొల్లామ్కు చెందిన వ్యక్తులే అని తేలింది. ఆగస్టు ఒకటో తేదీన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూలై 22వ తేదీన ఆ మహిళ కేరళకు వచ్చింది.