India-US Deal | భారత్కు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక ప్యాకేజీని ఆమోదించింది. దాంతో వంద జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు, 216 ఎక్సాలిబర్ ప్రెసిషన్ ఆర్టిలరీ రౌండ్స్ విక్రయానికి మార్గం సుగమమైంది. అంతర్జాతీయ ఆయుధ ఒప్పందానికి అవసరమైన ప్రక్రియ అయిన ఈ ప్రతిపాదిత డీల్ గురించి డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (DSCA) కాంగ్రెస్కు అధికారిక సమాచారాన్ని సమర్పించింది. ఈ డీల్ విలువ 93 మిలియన్ డాలర్లు. ఈ ఒప్పందంలో 100 FGM-148 జావెలిన్ క్షిపణులు, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు, 216 ఎక్సాలిబర్ ప్రెసిషన్ ఆర్టిలరీ రౌండ్లతో పాటు వాటి ఆపరేషన్, నిర్వహణ, సేఫ్టీ చెకింగ్, దళాల శిక్షణ ప్యాకేజీలో భాగం. ఈ ఒప్పందం యూఎస్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని డీఎస్సీఏ స్పష్టం చేసింది.
ప్రస్తుత, భవిష్యత్ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు, సరిహద్దు రక్షణను బలోపేతం చేయడం, ప్రాంతీయ ముప్పును సమర్థవంతంగా నిరోధించడంలో భారత్ దేశ సామర్థ్యాని పెంచుతుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఆధునిక ఆయుధాలను స్వీకరించడంలో భారత్కు ఎలాంటి ఉండదని, ఈ ఆయుధ అమ్మకం దక్షిణాసియాలో సైనిక సమతుల్యతను మార్చదని అమెరికా పేర్కొంటున్నది. ఈ ఒప్పందంలో ప్రస్తుతం ఆఫ్సెట్ ఒప్పందం లేదని.. అలాంటి నిబంధన ఉంటే.. అది భారత్, తయారీ సంస్థల మధ్య విధిగా నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. జావెలిన్ మిస్సైల్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన షోల్డర్ ఫైర్డ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్. భవనాలు, బంకర్లు వంటి మూసివున్న ప్రదేశాల నుంచి ఫైర్ చేయొచచు. ఉక్రెయిన్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో రష్యన్ టీ72, టీ90 ట్యాంకులను ధ్వంసం చేసి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్స్కాలిబర్ ఆర్టిలరి జీపీఎస్ గైడెడ్… అంటే అవి ఫిరంగుల నుంచి ఫైర్ చేసిన సమయంలో ఖచ్చితత్వంతో టార్గెట్ను ఛేదిస్తాయి.