పాల్ఘర్: మృతుడి స్వగ్రామానికి సరైన రోడ్డు లేదనే కారణంతో ఓ దవాఖాన అంబులెన్స్ డ్రైవర్ అతడి శవాన్ని రోడ్డు పక్కనే వదిలి వెళ్లిన ఘటన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో జరిగింది. దీంతో చేసేదేమీ లేక బంధువులు శవాన్ని వస్త్రంతో చేసిన ‘జోలీ’లో గ్రామానికి మోసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.
అంబేపాడా పంచాయతీలోని వాగడాడా అనే కుగ్రామానికి చెందిన శైలేశ్ మాగన్ శ్వాసకోశ వ్యాధి, అంతర్గత రక్త స్రావంతో ఈ నెల 3న వేదాంత వైద్య కళాశాల దవాఖానలో చేరి అదే రోజు చనిపోయాడు.