Amba Prasad | ఈడీ విచారణకు ముందు వీడియో సాంగ్ రిలీజ్ చేసిన మహిళా ఎమ్మెల్యే.. అదరగొట్టిందిగా..Video
Amba Prasad | కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జార్ఖండ్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబా ప్రసాద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ దాదాపు 6 గంటలపాటు విచారించింది. అయితే ఈడీ విచారణకు కొన్ని గంటల ముందు ఆమె.. తాను సొంతంగా పాడి, ఆడిన వీడియోసాంగ్‌ను రిలీజ్ చేశారు.
Amba Prasad : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జార్ఖండ్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబా ప్రసాద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ దాదాపు 6 గంటలపాటు విచారించింది. అయితే ఈడీ విచారణకు కొన్ని గంటల ముందు ఆమె.. తాను సొంతంగా పాడి, ఆడిన వీడియోసాంగ్‌ను రిలీజ్ చేశారు.
సోమవారం ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తన తొలి పాట అయిన ‘జియా హర్షాయే’ను అంబా ప్రసాద్ లాంచ్ చేశారు. నూతన సంవత్సరం ప్రారంభానికి సూచికగా జరుపుకునే సర్హోల్ పండుగ ముందు రోజు తన పాట లాంచింగ్ జరిగింది. ఆ తర్వాత అంటే సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈడీ కార్యాలయంలో అధికారులు ఆమెను ప్రశ్నించారు.
వీడియో సాంగ్‌పై అంబాదాస్ మాట్లాడుతూ.. ‘ఏదో చిన్న ప్రయత్నం చేశాను. చిన్నప్పటి నుంచే నాకు పాటలు, డ్యాన్స్‌లు అంటే ఇష్టం. కాబట్టి సర్హోల్ పండుగ సందర్భంగా నా తొలి సాంగ్ చేశాను’ అని చెప్పారు. ‘సంగీతం నా జీవితంలో భాగం. ఎప్పుడు అవకాశం వచ్చినా వినియోగించుకునేదాన్ని. సంగీతం మనసును కుదుటపరుస్తుంది. సంగీతం మానసిక ఒత్తిని తగ్గిస్తుందని శాస్త్రీయంగా కూడా రుజువైంది’ అని తెలిపారు.
ఈడీ విచారణ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం తనకు చిన్నప్పటి నుంచే అలవాటైందని అంబా ప్రసాద్ చెప్పారు. న్యాయమే గెలుస్తుందని తాను నమ్ముతున్నానని తెలిపారు. కాగా అంబా ప్రసాద్ పాట ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ పాటపై మీరు కూడా ఓ లుక్కేయండి..
आप सभी को जय जोहार एवम सरहुल पर्व कि हार्दिक शुभकामनाएं एवम बधाई 🙏🙏🙏🌹💐
गीत संगीत हमारी ज़िंदगी का रस हैं। ज़िन्दगी की यही रीत है
जीवन का सुर ही संगीत है।सरहुल पर्व के पावन अवसर पर प्रकृति प्रेम पर आधारित इस गीत को मैंने अपनी आवाज दी है एवं गाने में अभिनय के माध्यम से… pic.twitter.com/sX6SUMfOXk
— Amba Prasad (@AmbaPrasadINC) April 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

