గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 20:57:22

అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

జమ్మూ : ఈ ఏడాది నిర్వహించనున్న అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు శ్రీ అమర్‌నాథ్‌ జీ దేవస్థానం బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నేతృత్వంలో బోర్డు సమావేశం జరిగింది. అనంతరం కరోనా మహమ్మారి కారణంగా యాత్రను రద్దు చేస్తున్నామని, ఈ పరిస్థితుల్లో యాత్ర నిర్వహించడం మంచిది కాదంది. యాత్రను రద్దు చేయడంపై బోర్డు విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో యాత్రలు నిర్వహించలేమని, తెలిపింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఉదయం, సాయంత్రం వేళల్లో హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు తెలిపింది. యాత్ర జూలై 21 నుంచి ప్రారంభమై ఆగస్టు 3 వరకు కొనసాగాల్సి ఉండగా, కరోనా వైరస్‌ సంక్రమణ క్రమంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo