జమ్ము: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ బుధవారం అమర్నాథ్ యాత్ర మొదలైంది. తొలి బ్యాచ్‌కు చెందిన 5,880 మంది భక్తుల యాత్రను జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ఇక్కడి భాగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. దీంతో అనంత్‌నాగ్, గందేర్బాల్లలోని జంట మార్గాల్లో భక్తుల యాత్ర గురువారం నుంచి మొదలవుతున్నట్టు అధికారులు ప్రకటించారు.
వెయ్యిమందికిపైగా మహిళలు, 31మంది చిన్నారులు, 16 మంది ట్రాన్స్జెండర్లతో కూడిన తొలి బ్యాచ్ బేస్ క్యాంప్‌ను వీడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 9తో ముగుస్తున్న అమర్నాథ్ యాత్ర కోసం 3.31లక్షల మందికిపైగా రిజిష్టర్ చేసుకున్నట్టు చెప్పారు.