శ్రీనగర్ : అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్ట్టు 28 వరకు కొనసాగనుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర మొదటి బ్యాచ్ జూలై 1న ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. యాత్ర కోసం ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ సిన్హా ఆదివారం రాజ్భవన్లో ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం 13 నుంచి 70 ఏండ్లలోపు వయసు గల వారిని యాత్రకు అనుమతిస్తారు. సంప్రదాయ నున్వాన్-పహల్గాం, బలతల్-గండేర్బల్ మార్గాల్లో యాత్ర సాగుతుంది. దేశ వ్యాప్తంగా నిర్దేశిత 556 బ్యాంక్ శాఖల్లో లేదా శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డ్ వెబ్సైట్లో యాత్రికులు తమ పేరు నమోదు చేసుకోవచ్చు. యాత్రికులకు ఈసారి ఆర్ఎఫ్ఐడీ కార్డులను అందించి వారి భద్రతను ట్రాక్ చేయనున్నారు. వారి ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచారు.