న్యూఢిల్లీ, జూన్ 27: ప్రముఖ జర్నలిస్టు, ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. సోమవారం విచారించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.