న్యూఢిల్లీ, జూన్ 11: మోదీ మంత్రివర్గంలో ఇంచుమించు అందరూ కోటీశ్వరులే. మొత్తం 71 మందిలో 70 మంది ఆస్తులు వెల్లడించగా, 99 శాతం కోటీశ్వరులని, వారి సగటు ఆస్తులు 107.94 కోట్లని ఏడీఆర్ తెలిపింది. వీరిలో ఏపీకి చెందిన చంద్రశేఖర్ 5705.47 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు.
మొత్తం మంత్రుల్లో 28 మందిపై (39 శాతం) క్రిమినల్ కేసులుండగా, అందులో 19 మందిపై హత్య, మహిళలపై నేరాలు, విద్వేష ప్రసంగాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. మంత్రివర్గంలో 80% గ్రాడ్యుయేట్లు 11 మంది మంత్రుల విద్యార్హత 12వ తరగతి కాగా, 57 మంది గ్రాడ్యుయేట్, ఆపై విద్యార్థతను కలిగి ఉన్నారు. మరో ముగ్గురు డిప్లొమా హోల్డర్స్.