న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేప్ బాధితురాలిని ఊరేగించారు. ఆమె వెంట్రుకలను కత్తిరించింది.. ముఖానికి నల్లటి రంగు రుద్ది.. వీధుల్లో కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగురు మహిళలను అరెస్టు చేశారు. ఈస్ట్ ఢిల్లీలోని షాదారాలో ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత కక్ష వల్లనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన పట్ల విచారణ ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు. వ్యక్తిగత కక్ష వల్ల ఓ మహిళపై దురదృష్టవశాత్తు లైంగిక దాడి జరిగిందని, బాధితురాలి కుటుంబానికి సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 20 ఏళ్ల వయసు ఉన్న ఆ మహిళను అక్రమ మద్యం అమ్మేవాళ్లు గ్యాంగ్ రేప్ చేసినట్లు డీసీడబ్ల్యూ చైర్మెన్ స్వాతి మాలివాల్ ఆరోపించారు. కస్తూర్బా నగర్లో ఆ మహిళను కొట్టుకుంటూ ఊరేగిస్తున్న వీడియో ఆమె తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ దాడికి పాల్పడిన మహిళల్ని కూడా అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.
कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3
— Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022