Karnataka | పాక్ మాకు శత్రుదేశం కాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలతో కర్ణాటక అసెంబ్లీలో దుమారం
పాకిస్థాన్ బీజేపీకే శత్రు దేశమని, తమకు మాత్రం అది పొరుగు దేశమని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరి ప్రసాద్ బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ దేశ వ్యతిరేక భావాలకు ఆశ్రయం ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Karnataka | బెంగళూరు: పాకిస్థాన్ బీజేపీకే శత్రు దేశమని, తమకు మాత్రం అది పొరుగు దేశమని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరి ప్రసాద్ బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ దేశ వ్యతిరేక భావాలకు ఆశ్రయం ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు దీనికి బీజాలు మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాల అనంతరం పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయోత్సవాల్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని శాసన సభలో లేవనెత్తారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి స్పందిస్తూ, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
హుస్సేన్ విజయోత్సవాల్లో
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నాసిర్ హుస్సేన్ విజయం సాధించినట్లు ప్రకటించిన తర్వాత ఆయన మద్దతుదారులు మంగళవారం రాత్రి శాసనసభ వద్ద సంబరాలు చేసుకున్నారు. వారిలో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసినట్లు బీజేపీ, కొన్ని టీవీ చానళ్లు ఆరోపించాయి. అదేవిధంగా ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. కర్ణాటకలోని బెళగావి, చిత్రదుర్గ, మాండ్యలలో బీజేపీ బుధవారం ధర్నాలు నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

