ప్రయాగ్‌రాజ్ : అత్యాచార బాధితురాలికి వైద్యపరంగా గర్భవిచ్ఛితి చేసుకునే హక్కు చట్టపరంగా ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. బిడ్డను కనాలో వద్దో నిర్ణయించుకునే అధికారం బాధితురాలికి ఉందని తెలిపింది. గర్భవిచ్ఛితిని కోరుతూ ఓ బాలిక దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ జరిపింది. అత్యాచార బాధితురాలికి అబార్షన్ చేసుకునే హక్కు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌లోని సెక్షన్ 3(2) కల్పిస్తుందని ధర్మాసనం పేర్కొంది. లైంగిక దాడి కేసులో ఒక మహిళకు గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వకపోవడం, బలవంతంగా ఆమెకు మాతృత్వ బాధ్యతలు కట్టబెట్టడం గౌరవప్రదంగా జీవించే హక్కును ఆమెకు లేకుండా చేయడమేనని తెలిపింది.