లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్ల కూల్చివేతకు సర్వం సిద్ధమయింది. మధ్యాహ్నం 2.30 గంటలకు అపెక్స్, సియానే జంట టవర్లను నేలమట్టం చేయడానికి అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. వంద మీటర్ల ఎత్తున్న ఈ రెండు ఆకాశ హర్మ్యాలు దాదాపు 9-12 సెకండ్ల వ్యవధిలోనే పేకమేడల్లా కుప్పకూలనున్నాయి. దీనికోసం 3,700 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు. వీటికి రెండువేల వరకు కనెక్షన్లు ఇచ్చారు. కూల్చివేత వల్ల సమీపంలోని భవనాలకు నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ భవానల్లో ఉన్నవారిని ఇప్పటికే ఖాళీ చేయించారు. ట్విన్ టవర్స్‌కు రెండో కిలోమీటర్ల పరిధిలో విమానాలు ఎగరకుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 2 నుంచి 3 గంటల వరకు నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ట్రాఫిక్ నిలిపివేయనున్నారు.
భవనాల కూల్చివేత ద్వారా 80 వేల టన్నుల శిథిలాలు పోగవనున్నాయి. స్టీల్, శిథిలాలు వేరుచేసి 50 వేల టన్నుల శిథిలాలతో టవర్ల బేస్మెంట్ పూడ్చివేనున్నారు. 30 వేల టన్నుల శిథిలాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి టైల్స్గా మార్చనున్నారు. మూడు నెలల్లో శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఎడిఫైస్ అనే ఇంజినీరింగ్ సంస్థ ఈ టవర్లను కూల్చివేయనుంది. ఇదే సంస్థ 2020లో కేరళలో ఇదేవిధంగా భవనాలను నేలమట్టం చేసింది.
Noida, UP | Two housing societies, including 40 towers, next to #SupertechTwinTowers fully evacuated, ahead of demolition at 1430 hours today
560 police personnel, 100 people from reserve forces, 4 Quick Response Teams & NDRF team deployed in the area pic.twitter.com/su9qXHlu85
— ANI (@ANI) August 28, 2022