న్యూఢిల్లీ : అమెరికాకు అన్ని రకాల తపాలా సేవలను నిలిపివేసినట్లు ఇండియా పోస్ట్ ఆదివారం ప్రకటించింది. అమెరికా కస్టమ్స్ డిపార్ట్మెంట్ కొత్త నిబంధనల్లో స్పష్టత లేకపోవడమే దీనికి కారణమని తెలిపింది.
అమెరికాకు మెయిల్‌ను రవాణా చేయడానికి క్యారియర్స్ అశక్తత వ్యక్తం చేయడంతోపాటు, నియంత్రణ యంత్రాంగాల్లో స్పష్టత కొరవడటం వల్ల అన్ని రకాల బుకింగ్స్‌ను నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.