బాగ్పట్(యూపీ): మహిళలకు వారి పెండ్లి సమయంలో బంగారు, వెండి నగలకు బదులుగా ఆయుధాలను కానుకలుగా ఇవ్వాలని అఖిల భారత క్షత్రియ మహా సభ ప్రతిపాదించింది. తద్వారా వారిని వారు రక్షించుకొనేలా సాధికారత కల్పించొచ్చని అభిప్రాయపడింది. గత ఆదివారం ఉత్తరప్రదేశ్లోని గౌరిపూర్ మిట్లి గ్రామంలో జరిగిన ‘కేసరియా మహా పంచాయత్’లో ఠాకూర్ వర్గాన్ని ఉద్దేశించి మహా సభ అధ్యక్షుడు అజయ్ ప్రతాప్ సింగ్ ప్రసంగించారు.
నేటి సామాజిక వాతావరణంలో కూతుళ్లకు నగలను కానుకగా ఇవ్వడం కంటే వారి ఆత్మ రక్షణ కోసం ఆయుధాలివ్వడం ఎంతో విలువైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు క్షత్రియ మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చేవారని.. ఇప్పుడు ఆ పద్ధతిని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.