Tiktok | టిక్‌టాక్‌కు మరో షాక్ తగిలింది. ఈ చైనీస్ యాప్‌ను అల్బేనియా సైతం నిషేధించింది. ఆ యాప్‌లో అంతా బురద, చెత్త మాత్రమే కనిపిస్తుందని ఆ దేశ ప్రధానమంత్రి ఈడీ రామా పేర్కొన్నారు. టిక్‌టాక్‌ను కనీసం 2025 నుంచి సంవత్సరం నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం ఈడీ రామా టిరానాలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సైకాలజిస్టులతో సమావేశం నిర్వహించారు. ఏడాది పాటు ఈ యాప్‌ను బ్యాన్ వదించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఓ కార్యక్రమాన్ని సైతం ప్రారంభించనున్నది. దాంతో తల్లిదండ్రులకు చేయతనిచ్చేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. చైనాలో పాఠ్యాంశాలు, విద్య సంబంధిత కార్యక్రమాల కోసం టిక్‌టాక్‌ని ఉపయోగిస్తున్నారన్నారు. అయితే, చైనా వెలుపల మనకు టిక్‌టాక్‌లో అంతా బురద, చెత్త మాత్రమే మనకు కనిపిస్తుందన్నారు. ఆ యాప్ అవసరం మనకు ఎందుకు? అని ప్రశ్నించారు. ఇది పిల్లలకే కాదని.. మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు.
ఇటీవల, టిరానాలో సోషల్ మీడియా ఘర్షణలో 14 ఏళ్ల విద్యార్థి మరణించాడు. ఈ క్రమంలో సోషల్ నెట్వర్కింగ్ యాప్‌ను బ్లాక్ చేయడానికి చర్య చేపట్టారు. ఆ తర్వాత సోషల్ నెట్వర్కింగ్ ప్రభావంపై దేశంలో చర్చ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే టిక్టాన్ను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు నిషేధించాయి. ఇందులో భారత్ సైతం ఉన్నది. టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన 58 యాప్‌లను 2020లో భారత్ నిషేధించింది. అలాగే, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇండోనేషియా, కిర్గిస్థాన్, ఆస్ట్రేలియా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, బెల్జియం, డెన్మార్క్, కెనడా, న్యూజిలాండ్, తైవాన్, మాల్టా, ఫ్రాన్స్, నార్వే, లాట్వియా సైతం టిక్‌టాక్‌ను నిషేధించాయి. ఇప్పటికే అమెరికాలో యాప్‌ను నిషేధించాలని చట్టసభ్యులు డిమాండ్ చేశారు. భారతీయ-అమెరికన్ రాజా కృష్ణమూర్తితో సహా ఇద్దరు యూఎస్ చట్టసభ సభ్యులు వచ్చే వారం టిక్‌టాక్‌ను యాప్ స్టోర్ల నుండి తొలగించాలని ఆపిల్, గూగుల్ సంస్థలను కోరారు.