రాయ్‌పూర్, మార్చి 6: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో అంతుచిక్కని వ్యాధి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. బత్వాల్ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో 13 మంది ఈ వ్యాధి బారిన పడి కన్నుమూశారు. ఎడతెరపి లేకుండా దగ్గు, ఛాతిలో నొప్పి లక్షణాలు మాత్రమే కనబడుతున్నాయి.
అయితే ఈ మరణాలకు కారణమవుతున్న ఈ వ్యాధి ఏమిటో, దీని లక్షణాలు ఏమిటో ఇంతవరకు ఎలాంటి వివరాలు లభించ లేదని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తొలుత ఈ వ్యాధి జమ్ముకశ్మీర్‌లో, తర్వాత రాజస్థాన్‌లో విస్తరించి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌కు చేరుకుందని చెప్పారు. మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పులు, మహువా పంట సేకరణ కారణం అయ్యిండొచ్చని భావిస్తున్నట్టు చెప్పారు.