బెంగళూరు : భారతదేశంలో అల్‌ఖైదా టెర్రర్ మాడ్యూల్‌ను నడుపుతున్న ప్రధాన సూత్రధారిని భద్రతా బలగాలు చాకచక్యంగా పట్టుకున్నాయి. అల్‌ఖైదా కార్యకలాపాలకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న 30 ఏండ్ల షామా పర్వీన్‌ను గుజరాత్ ఏటీఎస్ బృందం బెంగళూరులో అరెస్టు చేసింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడ్డ సంగతిని ఆమె పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలిసింది.
సోషల్ మీడియాలో జిహాద్ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినట్టు నేరాన్ని ఆమె అంగీకరించారు. ఆమెకు వ్యతిరేకంగా డిజిటల్ సాక్ష్యాలు లభించాయని.. గతవారం భద్రతా బలగాలకు చిక్కిన నలుగురు అల్‌ఖైదా సభ్యులు ఆమె గురించి చెప్పారని ఏటీఎస్ డీఐజీ సునీల్ చెప్పారు.