శ్రీనగర్: అల్ బద్ ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్‌లోని భద్రతా బలగాలు మంగళవారం మట్టుబెట్టాయి. కుల్‌గా ం జిల్లా హూరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, కొందరు పోలీసులకు గాయాలయ్యాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
చనిపోయిన ఉగ్రవాది అక్బరాబాద్ హూరాకు చెందిన ఆదిల్ మజీద్ లోనీగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు, ఓ పిస్టోల్, ఓ గ్రెనేడ్, రెచ్చగొట్టే ప్రసంగాలున్న వీడియోలు…మొదలైనవి స్వాధీనం చేసుకున్నారు.