Akhilesh Yadav | మోదీ సర్కార్ కూలడం ఖాయం : టీఎంసీ ర్యాలీలో అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
Akhilesh Yadav : కోల్‌కతాలో ఆదివారం జరిగిన టీఎంసీ ర్యాలీలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Akhilesh Yadav : కోల్‌కతాలో ఆదివారం జరిగిన టీఎంసీ ర్యాలీలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చెలాయించేది కొద్దిరోజులు మాత్రమేనని, ఈ ప్రభుత్వం నడిచేది కాదు ఇంటికి పోయే సర్కార్ అని అఖిలేష్ పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడి ఆ పార్టీని వెనక్కినెట్టారని, యూపీలోనూ ఇదే జరిగిందని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో కొలువుతీరిన కాషాయ పాలకులు అధికారంలో ఉండేది కొద్దిరోజులేనని, ఈ సర్కార్ నడిచేది కాదని, ఇది పడిపోయే ప్రభుత్వమేనని అఖిలేష్ స్పష్టం చేశారు. కాగా, ఎన్నికైన ఎంపీల్లో 38 శాతం మంది మహిళలున్న ఏకైక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎన్నికలకు ముందు చాలామంది చెప్పినా ఆ దిశగా వారెవరూ అడుగులు వేయలేదని అన్నారు.
38 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు చేపట్టినది కేవలం తమ పార్టీ మాత్రమేనని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. టీఎంసీ ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో అఖిలేష్ సాధించిన ఫలితాలకు తాను ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
యూపీలో మీరు ఇచ్చిన షాక్‌కు కాషాయ పాలకులు రాజీనామా చేయాల్సి ఉందని, కానీ వారు నిస్సిగ్గుగా పదవుల్లో కొనసాగుతున్నారని దుయ్యబట్టారు.కేంద్ర ఏజెన్సీలతో సహా వీలైనంతగా అన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. ఉత్తర బెంగాల్లో తాము మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోయామని, రానున్న రోజుల్లో అక్కడ కూడా విజయం సాధిస్తామని దీదీ ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Gorati Venkanna | దాశరథి ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకం : గోరటి వెంకన్న
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

