లక్నో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తన బాబాయ్ శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. పొత్తు విషయంపై గురువారం శివపాల్‌తో ఆయన నివాసంలో అఖిలేశ్, మూలాయం సింగ్ యాదవ్ చర్చలు జరిపారు. 2016లో అఖిలేశ్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు, శివపాల్ యాదవ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఎస్పీ నుంచి శివపాల్‌ను బహిష్కరించారు. అనంతరం శివపాల్ ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ స్థాపించారు.