ముంబై, నవంబర్ 13: తన కుమారుడికి చెందిన సంస్థ భూ కుంభకోణానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను రాజీనామా చేయాలంటూ ఓ హక్కుల కార్యకర్త చేసిన డిమాండ్‌పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. తన మనస్సాక్షి ప్రకారం రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
రూ.300 కోట్ల ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో అజిత్ పవార్ కుమారుడు పార్థా పవార్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ పేరు వెలుగు చూసింది. ప్రతిపక్షాల ఆరోపణలు నేప థ్యంలో గతవారం ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసి, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సారథ్యంలో విచారణకు ఆదేశించింది.