ముంబై: అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్‌కు భారీ ఊరట లభించింది. ప్రఫుల్‌కు సంబంధించిన రూ.180 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడం చట్టవిరుద్ధమని ముంబై కోర్టు తీర్పు చెప్పింది. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిపులేటర్స్ చట్టం కేసులను విచారించే అప్పిలేట్ ట్రైబ్యునల్ ఈ తీర్పు చెప్పింది. దక్షిణ ముంబైలోని సీజే హౌస్‌లో ఉన్న 12వ, 15వ అంతస్థులను ఈడీ గతంలో జప్తు చేసింది.
ఈ ఆస్తులు ప్రఫుల్ భార్య వర్ష, ఆయన కంపెనీ మిలినియం డెవలపర్స్ పేరిట ఉన్నాయి. అయితే వీటిని డ్రగ్స్ మాఫియా నేత, దావూద్ రైట్ హ్యాండ్‌గా భావించే ఇక్బాల్ మిర్చీ భార్య నుంచి చట్టవిరుద్ధంగా పొందినట్టు ఈడీ ఆరోపిస్తున్నది. అయితే ఈ ఆస్తులు ఇక్బాల్ మిర్చీకి సంబంధించినవి కాదని, మనీలాండరింగ్ జరిగినట్లు ఆధారాలు లేవని ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. తాజా పరిణామాలపై శివసేన నేత సంజయ్‌రౌత్ స్పందించారు. సీబీఐ, ఈడీ అనేవి బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని అనేందుకు ఇదే నిదర్శనమన్నారు.