మంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ రెబల్ వర్గ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆదివారం ఆ పార్టీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. ఎన్సీపీ మంత్రులతో పాటు కలిసిన ఆయన పార్టీ చీలిపోకుండా ఐక్యంగా ఉంచాలని శరద్‌ను అభ్యర్థించారు. అనంతరం ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ తమ విజ్ఞప్తిని శరద్ పవార్ ఆలకించారని, అయితే ప్రతిస్పందించలేదని అన్నారు.
సీఎం ఏక్నాథ్ షిండే ఆదివారం ఇచ్చిన తేనీటి విందుకు విపక్ష పార్టీలు గైర్హాజరయ్యాయి. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా దూరంగా ఉన్నట్టు శివసేన (యూబీటీ), శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రకటించాయి.