Microsoft outage : మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft windows) ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ కావడంతో శుక్రవారం స్తంభించిపోయిన ఎయిర్‌లైన్ సిస్టమ్స్ (Airline systems) ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి (Civil aviation minister) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ఆయన ప్రకటించారు.
అయితే శుక్రవారం నాటి మైక్రోసాఫ్ట్ ఔటేజ్ సమస్య కారణంగా కొన్ని కార్యకలాపాలు పెండింగ్‌లో పడ్డాయని, శనివారం మధ్యాహ్నానికి వాటిని పరిష్కరించామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సమస్య తలెత్తినప్పటి నుంచి తాము అన్ని ఎయిర్‌పోర్టులను పర్యవేక్షించామని, ఔటేజ్ కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకున్న వారికి రీఅడ్జెస్ట్మెంట్స్, రీఫండ్స్‌ను కూడా క్లియర్ చేయించామని మంత్రి చెప్పారు.